Mon Dec 23 2024 07:30:23 GMT+0000 (Coordinated Universal Time)
చిరంజీవికి హైకోర్టు ఆదేశాలు
జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని వివాదాస్పద స్థలంలో నిర్మాణాలు చేపట్టొద్దని మెగాస్టార్ చిరంజీవిని హైకోర్టు ఆదేశించింది.
జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని వివాదాస్పద స్థలంలో నిర్మాణాలు చేపట్టొద్దని సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిని హైకోర్టు ఆదేశించింది. వివాదాస్పద స్థలంలో స్టేటస్ కోను కొనసాగించాలని చిరంజీవితో పాటు, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీని ఆదేశిస్తూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా అవసరాల కోసం వినియోగించేందుకు కేటాయించిన 595 గజాల స్థలాన్ని చిరంజీవికి సొసైటీ విక్రయించిందని జె. శ్రీకాంత్ బాబు, మరికొందరు వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.
నిర్మాణాలు చేపట్టవద్దంటూ...
ఆ స్థలాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్వాధీనం చేసుకోకపోవడంతో నిబంధనలకు విరుద్ధంగా విక్రయించారని, అందులో చిరంజీవి నిర్మాణం చేపట్టారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న హైకోర్టు కౌంటర్లు దాఖలు చేయాలని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ తో, జీహెచ్ఎంసీని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెల 25కి వాయిదా వేసింది.
Next Story