Mon Dec 23 2024 17:02:03 GMT+0000 (Coordinated Universal Time)
హిజాబ్ వివాదం.. జీ స్కూల్ యాజమాన్యంపై కేసు
ముఖానికి స్కార్ఫ్ ధరించి పాఠశాలకు వచ్చిన విద్యార్థినిని జీ స్కూల్ యాజమాన్యం ఆమెను తిరిగి ఇంటికి..
దేశవ్యాప్తంగా కలకలం రేపిన హిజాబ్ వివాదం.. మరోసారి హైదరాబాద్ లో తెరపైకి వచ్చింది. ముఖానికి స్కార్ఫ్ ధరించి పాఠశాలకు వచ్చిన టెన్త్ విద్యార్థినిని జీ స్కూల్ యాజమాన్యం ఆమెను తిరిగి ఇంటికి వెళ్లాలని పంపేసింది. ఇంటికి వెళ్లిన విద్యార్థినిని తల్లిదండ్రులు ఏమైందని అడగ్గా.. అసలు విషయం చెప్పింది. దాంతో విద్యార్థిని తల్లిదండ్రులు యాజమాన్యం తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విద్యార్థిని ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా హయత్ నగర్ లోని జీ స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసింది. ఈ మేరకు పలు మీడియా ఛానళ్లలో కథనాలు వెలువడ్డాయి. ఈ కేసుపై స్కూల్ యాజమాన్యం ఎలా స్పందించిందన్న విషయం తెలియాల్సి ఉంది. కాగా.. హిజాబ్ వివాదానికి గురైన విద్యార్థిని హయత్ నగర్ కోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న వ్యక్తికి కుమార్తె అని తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story