Sun Dec 22 2024 21:40:39 GMT+0000 (Coordinated Universal Time)
న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్: ఆరు పబ్బులు అడ్డంగా బుక్
జూబ్లీహిల్స్‌లోని ఆరు పబ్‌లపై హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు
జూబ్లీహిల్స్‌లోని ఆరు పబ్‌లపై హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసులు నిబంధనలను విధించినా కూడా వాటిని పట్టించుకోలేదు ఈ పబ్ ల నిర్వాహకులు. కొత్త సంవత్సర వేడుకల నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ పబ్బులపై కేసు నమోదు చేశారు. పర్యావరణ చట్టం, హైదరాబాద్ సిటీ పోలీసు చట్టాన్ని ఉల్లంఘించినందుకు హాలో, టారో, క్సేనా, మకౌ, లెఫ్ట్ బార్ కిచెన్, గ్రీస్ మంకీ పబ్ లపై కేసు నమోదు చేశారు. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో నిర్ణీత సమయం దాటి పబ్బులు నడిపినందుకు.. అధిక సౌండ్ తో స్థానికులు ఇబ్బంది పెట్టినందుకు కేసు నమోదు చేశారు పోలీసులు.
హాలో, టారో, క్సేనా, మకౌ పబ్ లలో అనుమతించిన సౌండ్ కంటే ఎక్కువ డెసిబెల్స్ తో మ్యూజిక్ ప్లే చేశారు. అధికారుల గైడ్‌లైన్స్‌ను పాటించడంలో విఫలమైతే లైసెన్స్‌లను రద్దు చేసే అవకాశం ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పబ్‌లు, బార్లను గతంలోనే హెచ్చరించారు. ఈ ఉల్లంఘించిన వారిపై సంబంధిత శాఖలు చర్యలు తీసుకోనున్నాయి. హైదాబాద్ లో డిసెంబర్ 31 రాత్రి ఒంటింగంట వరకు మాత్రమే న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవాలని.. పబ్బులను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేసినా కొన్ని పబ్ లలో అంతకంటే ఎక్కువ సేపు జనం ఉన్నారు.
Next Story