Mon Dec 23 2024 00:15:38 GMT+0000 (Coordinated Universal Time)
9999 నెంబర్ ప్లేట్ ధర ఎంత పలికిందంటే
ఫ్యాన్సీ నెంబర్లను తమ వాహనాల వెనుక తగిలించుకోవాలని
ఫ్యాన్సీ నెంబర్లను తమ వాహనాల వెనుక తగిలించుకోవాలని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. లక్ కలిసొస్తుందనో.. లేక స్టేటస్ సింబల్ గానో భావించి ఫ్యాన్సీ నెంబర్లను భారీ ధరకు కొనుగోలు చేస్తూ ఉంటారు. విదేశాల్లోనే కాదు.. మన దేశంలో కూడా ఈ ఫ్యాన్సీ నెంబర్లకు గిరాకీ బాగానే ఉంటుంది. తాజాగా హైదరాబాద్ నగరంలో 9999, 0001 నెంబర్లకు నిర్వహించిన వేలంపాటలు లక్షలు కురిపించాయి.
హైదరాబాద్ ఈస్ట్ జోన్ పరిధిలో ఫ్యాన్సీ నంబర్ల బిడ్డింగ్ పోటాపోటీగా జరిగింది. బిడ్డింగ్ ద్వారా ఆర్టీఏ ఖజానాకు రూ. 18 లక్షల ఆదాయం సమకూరింది. టీఎస్ 11 ఈజడ్ 9999 నంబర్ ఏకంగా రూ. 9,99,999కి అమ్ముడుపోయింది. ఈ నంబర్ ను భారీ ధరకు చర్చ్ ఎడ్యుకేషనల్ సొసైటీ దక్కించుకుంది. టీఎస్ 11 ఎఫ్ఏ 0001 నంబర్ ను కామినేని సాయి శివనాగు అనే వ్యక్తి రూ. 3.50 లక్షలకు సొంతం చేసుకున్నారు. టీఎస్ ఎఫ్ఏ 0011 నెంబర్ ను శ్యామల రోహిత్ రెడ్డి రూ. 1.55 లక్షలకు దక్కించుకున్నారు.
Next Story