Mon Dec 23 2024 10:17:22 GMT+0000 (Coordinated Universal Time)
ఊహించని ప్రమాదంలో ప్రాణం పోగొట్టుకున్న ఆటో డ్రైవర్
హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం
హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే కాలనీలో ఫుట్‌పాత్‌పై ఉన్న భారీ వృక్షం నేలకొరిగింది. ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో అక్కడే ఆగివున్న రెండు ఆటోలపై చెట్టు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్ మృతి చెందాడు. రెండు ఆటోలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. మృతి చెందిన ఆటో డ్రైవర్‌ను గౌస్ పాషాగా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. చెట్టు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం కూడా కూలిపోయింది. దీంతో అప్రమత్తమైన విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. చెట్టును డీఆర్ఎఫ్ బృందాలు రోడ్డు మీద నుంచి తొలగించారు.
నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఎప్పటి లాగే గౌస్ ఆటో నడుపుకుంటూ వెళ్తున్న సమయంలో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ సిగ్నల్ వద్ద ప్రమాదవ శాత్తు ఒక భారీ వృక్షం అక్కడే సిగ్నల్ వద్ద నిలిచి ఉన్న ఆటో మీద ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. దీంతో ఆటోలో ఉన్న గౌస్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోను జరపడానికి స్థానికులు ప్రయత్నం చేశారు. కానీ అది వీలుకాకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, డిఆర్ఎఫ్ టీంలు చెట్టును పక్కకు జరిపి ఆటోను బయటకు తీశారు.
Next Story