Mon Dec 23 2024 04:35:40 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో అరెస్ట్
హైదరాబాద్ కు చెందిన ఛార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు తిరిగింది. మరొకరిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన ఛార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ స్కామ్ లో కీలక నిందితుడు రామచంద్రపిళ్లైకి బుచ్చిబాబు ఛార్టెడ్ అకౌంటెంట్ గా వ్యవహరిస్తున్నారు.
గతంలో సోదాలు...
గతంలోనూ గోరంట్ల బుచ్చిబాబు ఇంట్లో సీబీఐ సోదాలను నిర్వహించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో బుచ్చిబాబు కీలక భూమిక పోషించారని అనుమానించి పలుమార్లు ఢిల్లీకి పిలిపించి విచారణ జరిపారు. ఈరోజు బుచ్చిబాబును అరెస్ట్ చేశారు. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో అరెస్ట్ జరిగినట్లయింది.
Next Story