Sat Nov 23 2024 02:36:23 GMT+0000 (Coordinated Universal Time)
Biryani : బిర్యానీకే జై కొట్టిన హైదరాబాదీలు.. కిలోల కొద్దీ వండి వార్చి?
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో హైదరాబాద్ బిర్యానీ ప్రధమ స్థానాన్ని సంపాదించుకుంది. ఎక్కువ మంది ఆర్డర్ చేసి తినేశారు
హైదరాబాద్ నగరం అంటే గుర్తొచ్చేది చార్మినార్.. తో పాటు ఫేమస్ బిర్యానీ. ఇక్కడ బిర్యానీ రుచి చూడాలని ఎవరికి మాత్రం ఉండదు. ప్రపంచంలో ఎవరైనా హైదరాబాద్ బిర్యానీని తిని లొట్టలేయాల్సిందే. రాహుల్ గాంధీ సయితం హైదరాబాద్ కు వస్తే ఇక్కడ ఫేమస్ బిర్యానీని తినకుండా ఉండలేరు. రాజకీయ నేతల నుంచి సెలబ్రిటీల వరకూ సామాన్యుల నుంచి ధనికుల వరకూ ప్రతి ఒక్కరూ హైదరాబాద్ బిర్యానీని టేస్ట్ చూడకుండా ఉండలేరు. హైదరాబాద్ బిర్యానీకి ఆ ప్రత్యేకత ఉంది.
ఇంటికి వచ్చిన అతిధులు...
ఇక పండగలు... పబ్బాలు వస్తే ఇక బిర్యానీ ప్రియుల సంగతి చెప్పాల్సిన పనిలేదు. బిర్యానీ తిన్న తర్వాతనే ఏదైనా పని మొదలు పెడతారు. ఇక అతిధులు ఇంటికి వస్తే బిర్యానీని వడ్డించడం ఒక స్టేటస్ సింబల్ గా మారింది. ఇక వివాహాది శుభకార్యాల్లోనూ బిర్యానీ డిష్ తర్వాతనే మిగిలిన రుచులను ఆస్వాదిస్తారు ఎవరైనా. అంతగా ఫేమస్ అయిన హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. అందుకే ఎప్పటికీ డిమాండ్ తగ్గని ఆహారపు వస్తువుగా బిర్యానీ తొలివరసలో ఉంటుంది.
ఆర్డర్లు కూడా...
తాజాగా న్యూఇయర్ డే సందర్భంగా బిర్యానీ ఆర్డర్లు మామూలుగా లేవట. ప్రతి ఒక్కరూ బిర్యానీని ఆర్డర్ చేస్తుండటంతో హోటల్స్ యాజమాన్యం రోజుకంటే ఎక్కువ మొత్తంలో బిర్యానీ వండి వార్చారు. స్విగ్గీ వంటి సంస్థల ఆర్డర్లు కూడా ఎక్కువ బిర్యానీకే మొదటి ప్లేస్ ను ఇచ్చాయి. బిర్యానీని ఆర్డరిస్తే రాయితీలు కూడా ప్రకటించిన హోటళ్లు ఉన్నాయంటే నమ్మశక్యం కాదు. అందుకే న్యూ ఇయర్ వేడుకల్లో ఈ రాత్రి బిర్యానీ మిగిలిన ఆహార పదార్థాల కంటే ప్రధమ స్థానాన్ని సంపాదించుకుంది. చికెన్ బిర్యానీనే ఎక్కువ మంది ఆర్డర్ చేశారని లెక్కలు చెబుతున్నాయి. తర్వాత స్థానం కేకులు ఆక్రమించుకున్నాయట.
Next Story