Mon Dec 23 2024 15:00:21 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లోని అపార్ట్మెంట్ లోకి దూసుకొచ్చిన బుల్లెట్
హైదరాబాద్ లోని ఓ అపార్ట్మెంట్ లోకి బుల్లెట్ దూసుకు వచ్చింది
హైదరాబాద్ లోని ఓ అపార్ట్మెంట్ లోకి బుల్లెట్ దూసుకు వచ్చింది. నార్సింగిలోని బైరాగిగూడలో ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్‌లోని కిటికీ అద్దంలోంచి బుల్లెట్ రావడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలవ్వకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బైరాగిగూడలోని అపార్ట్మెంట్లోని ఐదో అంతస్తులోని ఫ్లాట్‌లో ఉదయం ఈ ఘటన జరిగింది. అయితే అపార్ట్మెంట్ ఫైరింగ్ రేంజ్‌కు సమీపంలో ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీమ్‌తో ఘటనా స్థలానికి చేరుకుని బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు బుల్లెట్‌ను స్వాధీనం చేసుకుని స్థానిక ఆర్మీ అధికారులతో విచారణ చేపట్టారు. సమీపంలోని ఫైరింగ్ రేంజ్లో ఆర్మీ సిబ్బంది నిత్యం ప్రాక్టీస్ చేస్తారని, బుల్లెట్ అక్కడి నుంచి అపార్ట్మెంట్ లోకి వచ్చి ఉండవచ్చని స్థానికులు భావిస్తూ ఉన్నారు. అయితే పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు.
Next Story