Hyderabad: హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్తను ఇలా మోసం చేశారు
దేశంలో సైబర్ క్రిమినల్స్ రోజు రోజుకీ పేట్రేగిపోతున్నారు. చదువుకున్న వాళ్ళా.. కాదా అనే తేడా లేకుండా
దేశంలో సైబర్ క్రిమినల్స్ రోజు రోజుకీ పేట్రేగిపోతున్నారు. చదువుకున్న వాళ్ళా.. కాదా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ మాయ చేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన ఓ 49 ఏళ్ల వ్యాపారవేత్త సైబర్ క్రిమినల్స్ మోసానికి బలయ్యాడు. ఫెడెక్స్ అధికారులుగా నటిస్తున్న మోసగాళ్ల చేతిలో రూ.22 లక్షలు పోగొట్టుకున్నాడు. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితుడికి ఫెడెక్స్ ముంబై పార్శిల్ బ్రాంచ్ ఆఫీస్ నుండి కాల్ చేస్తున్నామని తెలిపారు. ముంబయి నుంచి ఇరాన్‌కు పార్శిల్ వెళుతోందని.. ఆ పార్శిల్లో ఐదు పాస్‌పోర్ట్‌లు, మూడు బ్యాంక్ క్రెడిట్ కార్డులు, ఒక ల్యాప్‌టాప్, నాలుగు కిలోల బట్టలు, 140 గ్రాముల MDMA ఉన్నట్లు తెలిపారు. ఆ పార్శిల్ మీ ఆధార్ కార్డు మీద బుక్ చేశారంటూ బెదిరించడం మొదలు పెట్టారు. క్రైమ్ డిపార్ట్మెంట్కు చెందిన నకిలీ డిఎస్పితో స్కైప్ వీడియో కాల్లో మాట్లాడించారు. మనీలాండరింగ్‌కు సంబంధించిన అనుమానాలు ఉన్నాయంటూ బ్యాంకు వివరాలను అడిగాడు. మీ డబ్బులు మీకు వెనక్కు ఇస్తాం.. వెరిఫికేషన్ కోసం బ్యాంక్ ఖాతాలోని మొత్తం బ్యాలెన్స్‌ను బదిలీ చేయాలని నిందితులు హామీ ఇచ్చారు.