Sun Dec 22 2024 22:41:30 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ రోడ్లపై మద్యం మత్తులో సీఐ వీరంగం
తాగి వాహనాలు నడిపే వాళ్ల కోసం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహిస్తూ ఉంటారు
తాగి వాహనాలు నడిపే వాళ్ల కోసం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహిస్తూ ఉంటారు. అలాంటిది పోలీసులే మందేసి రోడ్ల మీదకు వాహనాలతో వస్తే..! తాజాగా హైదరాబాద్ నగరంలో అలాంటిదే చోటు చేసుకుంది. బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ శ్రీనివాస్ తప్ప తాగి కారు నడిపి కూరగాయల వాహనాన్ని ఢీ కొట్టాడు. శ్రీనివాస్ రాత్రి సమయంలో వాహనాన్ని వేగంగా నడపడంతో ఎదురుగా వస్తున్న కూరగాయల వ్యాన్ ను ఢీకొట్టడంతో అందులో ఉన్న డ్రైవర్ శ్రీధర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆ వాహనం కూడా నుజ్జునుజ్జు అయింది. గాయపడిన శ్రీధర్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
సీఐ శ్రీనివాస్ ప్రస్తుతం డీఎస్పీ ప్రమోషన్ లో ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గురైన కారు వ్యాన్ లను బొల్లారం పిఎస్ కు తరలించారు. సీఐ శ్రీనివాస్ కు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా అందులో 210 పాయింట్లు వచ్చింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. సీఐ శ్రీనివాస్ ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్నారు. సీఐ శ్రీనివాస్ వాహనంపై ఇప్పటికే ఆరు ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు ఉన్నాయి.
Next Story