Sun Dec 22 2024 15:29:49 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షం.. అధికారుల హెచ్చరికలు
హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం వెంటాడుతూ ఉంది. మరో గంట పాటు నగరవ్యాప్తంగా భారీ వర్షం
హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం వెంటాడుతూ ఉంది. మరో గంట పాటు నగరవ్యాప్తంగా భారీ వర్షం కురవబోతోందంటూ మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో ప్రజల్ని అప్రమత్తం చేసింది జీహెచ్ఎంసీ. అవసరమైతే తప్ప బయటికి రావొద్దని జీహెచ్ఎంసీ సూచించింది.
హైదరాబాద్ లోని పలు చోట్ల కుండపోతగా వర్షం కురుస్తూ ఉంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. ఖైరతాబాద్, అమీర్పేట, సోమాజీగూడ, నాంపల్లి, మలక్పేట, సైదాబాద్, పాతబస్తీ, ఎల్బీనగర్, సాగర్రింగ్రోడ్, హస్తినాపురం, బీఎన్రెడ్డి, నాగోల్, ఉప్పల్, హబ్సిగూడ, తార్నాక, ఈసీఐఎల్, సికింద్రాబాద్, బేగంపేట, అడ్డగుట్ట, మారేడుపల్లి, ప్యాట్నీ, ప్యారడైస్, బోయిన్పల్లి, సుచిత్ర, కొంపల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, చిలకలగూడ, కూకట్పల్లి, హైదర్నగర్, నిజాంపేట్, ప్రగతినగర్, కేపీహెబీ కాలనీ, ఆల్విన్ కాలనీ, మియాపూర్, కుత్భుల్లాపూర్, బీహెచ్ఈఎల్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మెహదీపట్నంలో వర్షం పడుతూ ఉంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు తీసుకున్నారు.
Next Story