Mon Dec 23 2024 06:16:42 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో బయపడిన విస్కీ ఐస్క్రీమ్లు
హైదరాబాద్ నగరంలో విస్కీ ఐస్ క్రీముల గుట్టురట్టయింది. 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీమ్ ను పార్లర్ నుంచి స్వాధీనం చేసుకున్నారు
హైదరాబాద్ నగరంలో విస్కీ ఐస్ క్రీముల గుట్టురట్టయింది. 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీమ్ ను పార్లర్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. చిన్నపిల్లలు ఎంతో ఇష్టపడే ఐస్ క్రీమ్ లో వంద పేపర్ విస్కీ కలిపి ఎక్కువ ధరలకు అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ వన్ అండ్ ఫైవ్ లో హరికే కేఫ్ లో ఐస్ క్రీమ్ పార్లర్ షాపులో విస్కీ ఐస్ క్రీమ్ అమ్మకాలు సాగిస్తున్నారు. ఒక కేజీ ఐస్ క్రీమ్ లో 60ml పంద పేపర్ విస్కీ కలిపి అధిక ధరలకు అమ్మకాలు సాగిస్తున్నారు.
యాడ్ ఇచ్చి మరీ...
ఈ విస్కీ ఐస్ క్రీమ్ తయారీదారులు ఫేస్ బుక్ లో ఒక యాడ్ కూడా ఇచ్చి తమ అమ్మకాల్ని పెంచుకునే ప్రయత్నం చేశారు. ఆఫ్ కేజీ విస్కీ ఐస్ క్రీమ్ లను 23 పీస్ లను11.5 కేజీల విస్కీ ఐస్ క్రీములను ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్ టి ఎఫ్ టీం లీడర్ ప్రదీప్ రావు బృందం ఈ ఐస్క్రీమ్ లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. విస్కీతో ఐస్ క్రీమ్లను తయారు చేసిన వ్యక్తుల్లో దయాకర్ రెడ్డి శోభన్ లు ఉన్నారు. ఈ ఐస్ క్రీమ్ పార్లర్ను శరత్ చంద్రారెడ్డి అనే వ్యక్తి నడిపిస్తున్నారు. ఈ విస్కీ ఐస్ క్రీమ్ ఆపరేషన్ లో బలరాం ఎస్సై అరుణ్ మౌనిక ప్రసన్న యాదగిరి లు పాల్గొన్నారు.
Next Story