Mon Nov 25 2024 10:44:07 GMT+0000 (Coordinated Universal Time)
Scarlet Disease:పిల్లలను, తల్లిదండ్రులను భయపెడుతున్న 'స్కార్లెట్'
నిర్లక్ష్యం చేస్తే అది మరింత తీవ్రమవుతుందని వైద్యులు హెచ్చరిస్తూ ఉన్నారు
Scarlet Disease:హైదరాబాద్ నగరంలో స్కార్లెట్ ఫీవర్ టెన్షన్ మొదలైంది. చిన్న పిల్లలు పెద్ద సంఖ్యలో ఈ జ్వరం బారినపడుతున్నారు. ఆసుపత్రులలో స్కార్లెట్ ఫీవర్ బాధితుల సంఖ్య ఊహించని విధంగా పెరుగుతోంది. ఆసుపత్రులకు జ్వరంతో వెళుతున్న ప్రతి 20 మంది పిల్లల్లో 10-12 మందిలో స్కార్లెట్ ఫీవర్ లక్షణాలు ఉండడం ఆందోళన కలిగిస్తూ ఉంది. కొందరి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఆసుపత్రిలో అడ్మిట్ చేసి.. చికిత్స అందిస్తున్నారు.
నిర్లక్ష్యం చేస్తే అది మరింత తీవ్రమవుతుందని వైద్యులు హెచ్చరిస్తూ ఉన్నారు. స్కార్లెట్ జ్వరం స్ట్రెప్టోకోకల్ ఫారింగైటిస్ బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. ఈ వ్యాధి సోకిన చిన్నారులు దగ్గినా, తుమ్మినా ఆ తుంపర్ల ద్వారా ఇతరులకూ సోకుతుంది. పిల్లల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని, తగ్గే వరకు జాగ్రత్తగా చూసుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నారు. 102 డిగ్రీలతో కూడిన జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి, వికారం, వాంతులు, కడుపునొప్పి, శరీరంపై దద్దుర్లు కనిపిస్తాయి. ఇక నాలుక రంగు స్ట్రాబెర్రీ కలర్లోకి మారుతుంది. గొంతు, నాలుకపై తెల్లని పూత, ట్రాన్సిల్ ఎరుపు రంగులో పెద్దగా ఉంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలి. నిర్లక్ష్యం చేస్తే న్యూమోనియా, రుమాటిక్ ఫీవర్, తీవ్రమైన కీళ్ల నొప్పులు, గుండె సమస్యకు దారి తీస్తుంది. 5-15 ఏళ్ల వయస్సు పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. త్వరగా వ్యాపించే అవకాశం ఉన్నందున, లక్షణాలు ఉన్న పిల్లలను పాఠశాలకు పంపవద్దని వైద్యులు సూచించారు.
Next Story