Thu Mar 27 2025 22:55:46 GMT+0000 (Coordinated Universal Time)
నగరం నిర్మానుష్యం.. భారత్ - పాక్ మ్యాచ్ ఫలితం
ఆదివారం..అందులోనూ భారత్ - పాకిస్థాన్ ల మధ్య జరుగుతుండటంతో హైదరాబాద్ నగరం నిర్మానుష్యంగా మారనుంది

ఆదివారం..అందులోనూ భారత్ - పాకిస్థాన్ ల మధ్య జరుగుతుండటంతో హైదరాబాద్ నగరం నిర్మానుష్యంగా మారనుంది. మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి ఇంటికే లక్షలాది మంది పరిమితమవుతున్నారు. అత్యవసర పనులుంటే ఉదయం చూసుకుని మధ్యాహ్నానికి ఇంటికి చేరుకునేలా ప్లాన్ చేసుకున్నారు. ఇక అనేక హోటళ్లలో పెద్ద పెద్ద స్క్రీన్ లు పెట్టి క్రికెట్ ఫ్యాన్స్ ను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
అందరూ ఒకచోట చేరి...
ఇక స్నేహితులందరూ ఈ మ్యాచ్ కోసం ఒకచోట చేరి భారత్ - పాక్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయారు. దీంతో ఆదివారం కూడా హైదరాబాద్ నగరంలో ఎప్పుడూ ట్రాఫిక్ సమస్య తలెత్తేది. ఈరోజు మాత్రం మధ్యాహ్నం నుంచి ఖాళీగా దర్శనమివ్వనున్నాయి. ఉదయం వేళ మార్కెట్ పనులు చూసుకుని ఇంటికి వెళ్లేవారితో మాంసం మార్కెట్లు, కూరగాయల మార్కెట్లలో హడావిడి కనిపించింది.
Next Story