Mon Dec 23 2024 12:04:58 GMT+0000 (Coordinated Universal Time)
HCA: ఆ 20కోట్ల రూపాయలు ఏమయ్యాయి?
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను వివాదాలు వెంటాడం కొత్తేమీ కాదు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను వివాదాలు వెంటాడం కొత్తేమీ కాదు. ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఈడీ విచారణ చేపట్టింది. హెచ్‌సీఏలో రూ.20 కోట్ల నిధుల గోల్‌మాల్‌పై దర్యాప్తు కొనసాగుతోంది. హెచ్‌సీఏ మాజీ అధ్యక్షులు, కార్యదర్శులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ విచారించింది. మాజీ క్రికెటర్లు ఆర్షద్ అయూబ్, శివలాల్ యాదవ్‌ను అధికారులు విచారించారు. ఈ క్రమంలోనే హెచ్‌సీఏ మాజీ అధ్యక్షులు వినోద్‌కు నోటీసులు జారీ చేశారు. జనవరి మొదటి వారంలో విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు నోటీసుల్లో తెలిపారు.
HCAలో అక్రమాల వ్యవహారంలో బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే, హెచ్‌సీఏ మాజీ చీఫ్ వినోద్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. హెచ్‌సీఏలో రూ.20 కోట్ల నిధుల గోల్మాల్ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తుచేస్తూ ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్ష, కార్యదర్శులు అర్షద్ అయూబ్, శివలాల్ యాదవ్‌ను ఈ నెల 29న విచారించింది. వారితోపాటు వినోద్ కూడా విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ ఆయన గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఉప్పల్ స్టేడియం నిర్మాణ సమయంలో అక్రమాలు చోటుసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ఉప్పల్ పోలీసు స్టేషన్లో కేసు నమోదయింది. ఎఫ్ఎఆర్, అవినీతి నిరోధక శాఖ చార్జిషీట్ ఆధారంగా ఈ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది.
Next Story