Sat Dec 21 2024 14:54:33 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ ఉగ్రదాడి : కేరళ స్టోరీని తలపించేలా
హైదరాబాద్ ఉగ్ర కోణంలో కొత్త కోణం వెలుగు చూసింది. కేరళ స్టోరీని మించిన అంశాలు బయటకు వస్తున్నాయి
హైదరాబాద్ ఉగ్ర కోణంలో కొత్త కోణం వెలుగు చూసింది. కేరళ స్టోరీని మించిన అంశాలు బయటకు వస్తున్నాయి. భోపాల్ కు చెందిన ఈ యాసిర్ ఉగ్ర కోణంలో కీలక సూత్రధారి అని తేలింది. యాసిర్ ముగ్గురు హిందువులకు బ్రెయిన్ వాష్ చేసి ఇస్లాంలోకి మార్చారన్న ఆరోపణలున్నాయి. సౌరబ్ రాజ్ విద్యను మహ్మద్ సలీంగా మార్చాడు. దేవి ప్రసాద్ పండా ను అబ్దుల్ రెహ్మాన్ గా మార్చాడు. బస్కా వేణు కుమార్ ను కూడా అలాగే మార్చాడు.
పదహారు మంది అదుపులో...
ఈ కేసులో భోపాల్, హైదరాబాదులో 16 మందిని పోలీసులు పట్టుకున్నారు. పరారీ లో ఉన్న సలీం కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ సమీపంలోని అనంతగిరి గుట్టలో శిక్షణ పూర్తి చేసుుకున్నారని తెలిసింది. హైదరాబాద్ లో యాసిర్ దాడులకు ప్లాన్ చేశారని తెలిపారు. ఎవరికి వారే సింగిల్ గా దాడులు చేయాలని ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడయిదంి. హైదరాబాదులో కొన్నిచోట్ల డ్రోన్ ద్వారా రెక్కి చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. అరెస్టయిన వారి నుంచి తుపాకులు, కత్తులు, గొడ్డలి, ఎయిర్ పిస్టల్‌తో పాటు ఇస్లామిక్ సాహిత్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారని చెబుతున్నారు.
Next Story