Thu Dec 26 2024 13:19:37 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్‌లో రూ.15 కోట్లతో మరో అద్భుత నిర్మాణం
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. అందులో రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరంలో అభివృద్ధిలో..
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. అందులో రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరంలో అభివృద్ధిలో దూసుకుపోతోంది. మహా నగరం హైదరాబాద్ పర్యాటక రంగంలోనూ కూడా దూసుకుపోతోంది. నిజానికి ఐటీ, ఫార్మా రంగానికి కంటే ముందే హైదరాబాద్ పర్యాటక రంగంలో దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచిందనే చెప్పాలి. ఎన్నో చరిత్రాక కట్టడాలు, ఎన్నో అద్భుతమైన ప్రదేశాలకు కొలువై నిలుస్తోంది హైదరాబాద్. ప్రపంచంలోని ఎన్నో దేశాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. అయితే హైదరాబాద్ ఖ్యాతిని మరింత పెంచుతూ హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA) పర్యాటక రంగంలో మరింతగా అభివృద్ధి చేస్తోంది.
ఇక తాజాగా హైదరాబాద్‌లో మరో అద్భుతమైన నిర్మాణాన్ని చేపట్టింది. హుస్సేన్ సాగర్‌కు సమీపంలో ఉన్న జలవిహార్‌కు దగ్గరల్లో లేక్ ఫ్రంట్ పార్క్‌ను నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ లేక్ ఫ్రంట్ పార్క్ త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ‘హుస్సేన్ సాగర్‌కు సమీపంలో, హైదరాబాద్ నడిబొడ్డున మరో అద్భుత కట్టడం అందుబాటులోకి వచ్చింది. జలవిహార్‌కు సమీపంలో 10 ఎకరాల్లో హెచ్ఎండీఏ లేట్ ఫ్రంట్ పార్క్‌ను నిర్మించింది. త్వరలోనే ఈ పార్క్‌ను ప్రారంభించనున్నాము. ప్రజలంతా ఈ కొత్త నిర్మాణాన్ని సందర్శిస్తారని ఆశిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్.
ఈ నిర్మాణాన్ని ఈ ఫ్రంట్ పార్క్ నిర్మాణాన్ని హెచ్ఎండీఏ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. రూ. 15 కోట్లతో చేపట్టిన ఈ నిర్మాణంలో అండర్‌పాస్‌లు, స్కైవేలు, సీటింగ్‌తో కూడిన వాటర్ ఛానల్స్, లేక్ వంటి అద్భుత నిర్మాణాలు ఉన్నాయి. మధ్యలో చిన్నపిల్లలకు ఆటవిడుపు కోసం పార్క్‌ను కూడా నిర్మించారు. అంతేకాకుండా ఈ నిర్మాణం వల్ల 35 పక్షి జాతులకు భంగం వాటిల్లుతుందని పర్యావరణవేత్తల పిటిషన్ నేపథ్యంలో గతంలో సుప్రీం కోర్టు లేక్ ఫ్రంట్ నిర్మాణంపై ఆంక్షలు విధించింది. జీవ వైవిధ్యానికి విఘాతం కలిగించే విధంగా హుస్సేన్ సాగర్ చుట్టూ ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టకూడదని సుప్రీం కోర్టు గతంలోనే స్పష్టం చేసింది. వాటికి ఎలాంటి నష్టం జరుగకుండానే నిర్మాణం చేపడుతున్నట్లు హైదరాబాద్ నగర పాలక సంస్థ కోర్టుకు తెలిపింది. ఇప్పుడు ఎట్టకేలకు ప్రజలకు అందుబాటులోకి రానుంది.
Next Story