Mon Dec 23 2024 06:08:14 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad: మద్యం బాబులకు షాక్.. 2 రోజులు చుక్క దొరకదు
రెండు రోజుల పాటూ చుక్క దొరకదని
హైదరాబాద్ నగరంలో రెండు రోజుల పాటూ చుక్క దొరకదని మందుబాబుల్లో ఆందోళన మొదలైంది. హైదరాబాద్ సిటీలో రెండు రోజులు వైన్ షాపులు మూసివేస్తున్నట్లు తెలిపారు. జూలై 28, జూలై 29 రోజుల్లో వైన్ షాపులు మూసివేయనున్నారు. ఆదివారం, సోమవారం వరుసగా రెండు రోజులు మద్యం షాపులు మూసి వేస్తున్నట్లు తెలిపారు.
బార్లు, కళ్లు అంగళ్లలోనూ, వైన్స్ లో కూడా మద్యం లభించదు. ఇందుకు సంబంధించి నగర పోలీస్ కమిషనర్ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 2 రోజుల పాటు వైన్ షాపులు మూసి ఉంచనున్నారు. బోనాల పండగ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 20 (1974 చట్టం నెం.6) కింద సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 28.07.2024న ఉదయం 6 గంటల నుండి నుండి 29.07.2024న ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Next Story