Mon Dec 23 2024 02:05:12 GMT+0000 (Coordinated Universal Time)
మాదాపూర్ లో ఆ పార్టీ.. వాళ్లు అడ్డంగా దొరికిపోయారు
హైదరాబాద్ లోని మాదాపూర్ లో రేవ్ పార్టీ కలకలం రేపింది. విఠల్ రావు నగర్ వైష్ణవి అపార్ట్ మెంట్ లో
హైదరాబాద్ లోని మాదాపూర్ లో రేవ్ పార్టీ కలకలం రేపింది. విఠల్ రావు నగర్ వైష్ణవి అపార్ట్ మెంట్ లో యాంటీ నార్కొటిక్ బ్యూరో అధికారులు దాడుల చేసి పార్టీని భగ్నం చేశారు. భారీగా కొకైన్, ఎల్ఎస్ డీ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ వినియోగిస్తున్న ఐదుగురిని నార్కోటిక్ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో సినీ నిర్మాత వెంకట్ తో పాటు పలువురు ప్రముఖులు, సినీ పరిశ్రమకు చెందిన వాళ్లు ఉన్నారు. అరెస్ట్ చేసిన వారందరిని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు నార్కోటికి బ్యూరో అధికారులు.
ఈ పార్టీపై పక్కా సమాచారంతో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు చిక్కిన నిందితుల వద్ద భారీగా మాదక ద్రవ్యాలు లభించాయి. నిందితుల్లో ఓ సినీ నిర్మాత, ఇండస్ట్రీకి చెందిన పలువురు యువతులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పట్టుబడ్డ యువతీ యువకుల నుండి కొకైన్,LSD, Ecstasy పిల్స్, గాంజా తో పాటు 70వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story