Mon Dec 23 2024 03:57:41 GMT+0000 (Coordinated Universal Time)
అమీర్ పేట్ హోటల్ లో రాగి సంకటి ఆర్డర్ ఇచ్చాడు.. వచ్చింది చూసి
అమీర్‌పేట్‌లో రాగి సంకటిలో పురుగులు కనిపించాయని హైదరాబాదీ ఫిర్యాదు
అమీర్‌పేట్‌లోని ఆనందోబ్రహ్మ రెస్టారెంట్లో మంగళవారం పురుగులతో కూడిన భోజనాన్ని డెలివరీ చేశారని.. హైదరాబాద్ కు చెందిన ఓ కస్టమర్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశాడు. భరత్ నగర్ నివాసి కె.వంశీ సెప్టెంబర్ 13, 2022న Zomato నుండి లంచ్ ఆర్డర్ చేసారు. ఆనందోబ్రహ్మ రెస్టారెంట్ నుంచి చేసిన ఆర్డర్ లో రాగి సంకటి, నాటుకోడి పులుసు కోసం రూ.313 చెల్లించాడు. అతను రాగి సంకటి లోపల పురుగులను చూసి చాలా విస్తుపోయాడు. ఆహారం బాగాలేదని.. వారికి చూపించడానికి అతను నేరుగా రెస్టారెంట్లోకి వెళ్లాడు. అయితే రెస్టారెంట్ సరిగా స్పందించకపోవడంతో వంశీ నిరాశకు గురయ్యాడు.
అతను అందుకున్న కలుషిత భోజనం గురించి సోషల్ మీడియాలో వివరించాడు. అమీర్‌పేటలోని ఆనందోబ్రహ్మ రెస్టారెంట్ నుండి మేము ఆర్డర్ చేసినది ఇదే అంటూ రాగి ముద్దలో పురుగులు ఉన్న విషయాన్ని చూపించాడు. మేము ఆ రెస్టారెంట్‌కి వెళ్లి అడిగితే మీకు ఇష్టమొచ్చింది చేసుకోండి అంటూ ఎంతో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో.. కన్జూమర్ కోర్టుకు తీసుకువెళతానని ట్వీట్ చేశాడు.
రెస్టారెంట్ ప్రతిస్పందనపై అసంతృప్తి చెందిన వంశీ గ్రేటర్ మునిసిపల్ హైదరాబాద్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్‌కు తనకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారి హృదయకు బాధ్యతలు అప్పగించారు. ఆమె రెస్టారెంట్‌ను సందర్శించి పరీక్షల కోసం నమూనాలను తీసుకున్నారు. వాటిని పరీక్ష కోసం పంపారు. రిపోర్టులను బట్టి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Next Story