Mon Dec 23 2024 07:10:11 GMT+0000 (Coordinated Universal Time)
రష్యాలో ఉద్యోగం అనగానే వెళ్లిన హైదరాబాదీ చివరికి ఏమయ్యాడంటే?
హైదరాబాద్‌కు చెందిన 30 ఏళ్ల వ్యక్తి.. ఉద్యోగం కోసం వెళ్లి మోసపోయాడు
హైదరాబాద్‌కు చెందిన 30 ఏళ్ల వ్యక్తి.. ఉద్యోగం కోసం వెళ్లి మోసపోయాడు. రష్యా ఆర్మీలో చేరవలసి వచ్చింది. ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో రష్యా తరపున పోరాడిన అతడు మరణించినట్లు అధికారులు బుధవారం తెలిపారు. మహ్మద్ అస్ఫాన్ ను భారత్ కు తీసుకుని రావాలని యువకుని కుటుంబం సహాయం కోరుతోంది. AIMIM చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని సంప్రదించింది. AIMIM మాస్కోలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా, అస్ఫాన్ మరణించినట్లు అధికారులు ధృవీకరించారు.
యుద్ధంలో రష్యా తరఫున పోరాడుతూ హైదరాబాద్‌కు చెందిన 30 ఏళ్ల మహ్మద్ అఫ్సాన్ ప్రాణాలు కోల్పోయాడు. ఉద్యోగం విషయంలో మోసపోయి అతను రష్యన్ ఆర్మీలో బలవంతంగా చేరాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. రష్యా సైన్యానికి సహాయక సిబ్బందిగా పని చేస్తోన్న దాదాపు ఇరవై మంది భారతీయులను తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఇటీవలే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మహ్మద్ అస్ఫాన్ ను హైదరాబాద్ తీసుకు వచ్చేందుకు సాయం కోసం కుటుంబ సభ్యులు మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీని కలిశారు. మాస్కోలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా.. అఫ్సాన్ మృతి చెందినట్లు అక్కడి అధికారులు ధ్రువీకరించడంతో అతడి కుటుంబం దిగ్బ్రాంతిలో ఉంది.
ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా సైన్యానికి సహాయకుడిగా పనిచేస్తున్న గుజరాత్‌కు చెందిన 23 ఏళ్ల భారతీయ వ్యక్తి రష్యాలో మరణించిన వారాల తర్వాత మహ్మద్ అస్ఫాన్ మరణం గురించి తెలిసింది. సూరత్‌కు చెందిన హమీల్ మంగూకియా అనే వ్యక్తి ఆన్లైన్ ప్రకటన ద్వారా రష్యాలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుని చెన్నై నుండి మాస్కో చేరుకున్నాడు. అతను రష్యన్ సైన్యంలో సహాయకుడిగా చేరాడు.
Next Story