Mon Dec 23 2024 10:50:01 GMT+0000 (Coordinated Universal Time)
Asaduddin : అసద్ భాయ్‌కి ఆకలేసింది.. బిర్యానీ ఒకే ప్లేట్లో
హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ సాదాసీదాగా ఉంటారు. నేతలు, కార్యకర్తలతో కలసి పోతుంటారు.
హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ సాదాసీదాగా ఉంటారు. నేతలు, కార్యకర్తలతో కలసి పోతుంటారు. ఎంఐఎం పార్టీ అధినేతగా, ఎంపీగా ఆయనకు ఎలాంటి భేషజాలు లేవు. సామాన్యుడితో సామాన్యుడిలా కలిసిపోయే మనస్తత్వం ఉన్న అసుద్దీన్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆయన తాజాగా ఒక కాకా హోటల్ లో మరో ఇద్దరితో కలసి వచ్చి బిర్యానీ తినడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అదీ ఒకే ప్లేట్లో ముగ్గురు కలసి బిర్యానీ తినడం చూసిన వారు ముక్కున వేలేసుకున్నారు.
ఎమ్మెల్యేతో కలసి...
అసదుద్దీన్ ఒవైసీ నిన్న మధ్యాహ్నం యాకుత్‌పుర నియోజకవర్గంలో పర్యటించారు. యాకుత్‌పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ తో కలసి ఆయన అక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా అసద్ భాయ్‌కు ఆకలేసినట్లుంది. వెంటనే పక్కనే కనిపించిన ఒక చిన్న హోటల్ కు వెళ్లారు. అక్కడ బిర్యానీకి ఆర్డర్ ఇచ్చారు. హైదరాబాద్ లో బిర్యానీ పాతబస్తీలో ఎక్కడైనా నోటికి రుచిగా ఉంటుంది. ఫేమస్ అయిన బిర్యానీని ఆర్డర్ ఇచ్చి ముగ్గురు కలసి ఒకే ప్లేట్ లో తినడంతో అక్కడి వారు తొలుత ఆశ్చర్యపోయి ఆ తర్వాత అసద్ భాయ్ తో సెల్ఫీకి ఎగబడ్డారు.
సామాన్యుడిలా...
మామూలుగా మండీ హోటల్ లో ఒకే ప్లేట్ లో అందరూ కలసి తినడం సంప్రదాయం. కానీ అసద్ భాయ్ ఈ చిన్న హోటల్ లో కూడా ఎమ్మెల్యేతో పాటు మరో వ్యక్తితో కలసి ఒకే ప్లేట్ లో కలసి భోం చేశారు. అరబ్ కల్చర్ లో వారు ముగ్గురు బిర్యానీని టేస్ట్ చేయడం చూసిన అక్కడి వారు ఇది కదా అసద్ స్పెషాలిటీ అనకుండా ఉండలేకపోయారు. తనకున్న భద్రతను పక్కన పెట్టి ఆయన సామాన్యుడిలా వ్యవహరించడం అనేక సార్లు చూసి ఉంటాం. ఇప్పుడు తాజాగా కాకా హోటల్ లో బిర్యానీ తినడం కూడా అంతే.
Next Story