Thu Apr 17 2025 00:37:01 GMT+0000 (Coordinated Universal Time)
మెరుపు సమ్మెకు దిగిన మెట్రో రైలు ఉద్యోగులు
హైదరాబాద్ మెట్రో రైలు ఉద్యోగులు సమ్మెకు దిగారు. జీతాలు పెంచాలంటూ మెట్రో రైలు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు

హైదరాబాద్ మెట్రో రైలు ఉద్యోగులు సమ్మెకు దిగారు. తమకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మెట్రో రైలు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ టిక్కెట్ కౌంటర్ లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మాన్యువల్ టిక్కెట్ల జారీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
జీతాలు పెంచాలంటూ...
వివిధ స్టేషన్లలో దాదాపు 150 మంది సమ్మెకు దిగారు. ఐదేళ్ల నుంచి తమకు జీతాలను పెంచడం లేదని వారు ఆరోపిస్తున్నారు. టిక్కెట్ కౌంటర్ లలో పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రమే ఈ నిరసన చేస్తున్నారు. విధులకు సరైన సమయం లేదని, రిలీవర్ సరైన సమయానికి రాకపోయినా ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. తాము భోజనం చేయడానికి కూడా సమయం దొరకడం లేదని వాపోతున్నారు. అయితే టిక్కెట్ కౌంటర్లలో ఉద్యోగులు నిరసనకు దిగినా మెట్రో సేవలకు మాత్రం అంతరాయం కలగలేదు. యాజమాన్యం వారితో చర్చలు ప్రారంభించింది.
Next Story