Mon Dec 23 2024 09:21:56 GMT+0000 (Coordinated Universal Time)
రెండో రోజూ సమ్మెలో మెట్రో రైలు సిబ్బంది
మెట్రో రైలు సిబ్బంది రెండో రోజు కూడా విధులకు హాజరు కాలేదు. తమ సమ్మెను కొనసాగిస్తున్నారు.
మెట్రో రైలు సిబ్బంది రెండో రోజు కూడా విధులకు హాజరు కాలేదు. తమ సమ్మెను కొనసాగిస్తున్నారు. జీతాలు పెంచాలంటూ వారు చేస్తున్న సమ్మె నేడు రెండో రోజుకు చేరుకుంది. దాదాపు 150 మంది సిబ్బంది విధులకు హాజరుకాక పోవడంతో మెట్రో రైలు టిక్కెట్ ను నేరుగా కొనుగోలు చేయడానికి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. పాస్ లున్న వారికి ఎలాంటి ఇబ్బందులు లేవు కాని, పాస్ లు రెన్యువల్ చేసుకోవాలన్నా, టిక్కెట్ కొనుగోలు చేయాలన్నా కష్టంగా మారింది.
జీతాలు పెంచాలంటూ....
గత ఐదేళ్లుగా తమ జీతాలను పెంచడం లేదంటూ మెట్రో రైలు సిబ్బంది నిన్నటి నుంచి ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. మెట్రో రైలు యాజమాన్యం వారితో జరిపిన చర్చలు ఫలించలేదు. దీంతో రెండో రోజు కూడా వారు విధులకు హాజరు కాలేదు. నాగోల్ మెట్రో కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. తమ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ సమ్మెను కొనసాగిస్తామని ఉద్యోగులు చెబుతున్నారు.
Next Story