Mon Dec 23 2024 05:22:16 GMT+0000 (Coordinated Universal Time)
మెట్రో సిబ్బంది సమ్మె విరమణ
హైదరాబాద్ మెట్రో రైలు టిక్కెటింగ్ సిబ్బంది తమ సమ్మెను విరమించారు. ఈరోజు నుంచి వారు విధులకు హాజరవుతున్నారు.
హైదరాబాద్ మెట్రో రైలు టిక్కెటింగ్ సిబ్బంది తమ సమ్మెను విరమించారు. ఈరోజు నుంచి వారు విధులకు హాజరవుతున్నారు. ఆందోళన చేస్తున్న సిబ్బందితో మెట్రో యాజమాన్యం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ మెట్రో రైలు టిక్కెటింగ్ సిబ్బంది గత రెండు రోజుల నుంచి సమ్మెచేస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
డిమాండ్లకు సానుకూలంగా...
టిక్కెట్లు కొనేవారు ఇబ్బంది పడ్డారు. పాస్ లు ఉన్నవారికి ఎలాంటి అసౌకర్యం కలగలేదు. అలాగే మెట్రో రైలు సర్వీసులు కూడా యధాతధంగా నడిచాయి. అయితే ఇంక్రిమెంట్ తో పాటు తాము మెట్రో ట్రైన్ లో ఉచితంగా ప్రయాణించేందుకు యాజమాన్యం అనుమతించడంతో సమ్మెను విరమించామని చెబుతున్నారు. దీంతో మెట్రో ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోయినట్లయింది.
Next Story