Mon Dec 23 2024 04:37:46 GMT+0000 (Coordinated Universal Time)
Old City: పాతబస్తీలో ఓ మహిళను ఇంటి ముందే కిడ్నాప్ యత్నం
హైదరాబాద్లోని పాతబస్తీలో ఓ మహిళను ఆమె ఇంటి ముందు
హైదరాబాద్లోని పాతబస్తీలో ఓ మహిళను ఆమె ఇంటి ముందు నుంచి ఓ గుర్తుతెలియని వ్యక్తి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు. నస్రీన్ ఖాతూన్ అనే 30 సంవత్సరాల మహిళ హైదరాబాద్లోని సుల్తాన్ షాహీ ప్రాంతంలో నివసిస్తూ ఉంది. ఇంటి వెలుపల బట్టలు ఆరబెడుతూ ఉన్నప్పుడు కిడ్నాప్ ప్రయత్నం జరిగింది.
ఆ వ్యక్తి తన నోటిని వెనుక నుంచి మూసేసేందుకు ప్రయత్నించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. అయితే ఆమె అతన్ని దూరంగా నెట్టివేసి సహాయం కోసం కేకలు వేయడంతో.. ఆ వ్యక్తి సంఘటన స్థలం నుండి పారిపోయాడు. ఈ ఘటన జూలై 25న మధ్యాహ్నం 12:30 గంటలకు జరిగింది. అతడి నుండి తప్పించుకునే సమయంలో ఆమెకు గాయాలు అయ్యాయి.
సీసీటీవీ ఫుటేజీలో ఓ బైకర్ ను కొందరు వ్యక్తులు తరుముతూ ఉండడం చూడొచ్చు. ఓ అపరిచిత వ్యక్తి జులై 18న తన కుమార్తెతో అసభ్యంగా ఓ వ్యక్తి ప్రవర్తించాడని ఆ మహిళ గుర్తుచేసుకుంది. అయితే ఆమె కుమార్తె అతడి చేతిని కొరకడంతో ఆమెను వదిలేసి పారిపోయాడు. చిన్నారి తన తల్లికి ఈ విషయం గురించి చెప్పినా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఆమెకు కూడా అలాంటి ఘటనే ఎదురవ్వడంతో ఇప్పుడు పోలీసులను ఆశ్రయించింది. సీసీటీవీ ఫుటేజీని అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు.
Next Story