Fri Nov 22 2024 14:11:37 GMT+0000 (Coordinated Universal Time)
మనల్ని ఎవడ్రా ఆపేది.. ఆరు నెలల్లో 72 లక్షల బిర్యానీలు లాగించేశారు
హైదరాబాదీలు గత ఆరు నెలల్లో 72 లక్షలకు పైగా బిర్యానీ ఆర్డర్లు చేశారని, గత 12 నెలల్లో 150 లక్షలకు పైగా బిర్యానీ ఆర్డర్లు
హైదరాబాదీలు గత ఆరు నెలల్లో 72 లక్షలకు పైగా బిర్యానీ ఆర్డర్లు చేశారని, గత 12 నెలల్లో 150 లక్షలకు పైగా బిర్యానీ ఆర్డర్లు చేశారని ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ తాజాగా తెలిపింది. గత ఐదున్నర నెలల్లో 2022 ఇదే కాలంతో పోలిస్తే నగరంలో బిర్యానీ ఆర్డర్లలో 8.39% వృద్ధి నమోదైందని స్విగ్గీ తెలిపింది. హైదరాబాదీల ఫేవరెట్ దమ్ బిర్యానీ 9 లక్షలకు పైగా ఆర్డర్లతో తిరుగులేని ఛాంపియన్‌గా నిలిచిందని తెలిపారు. 7.9 లక్షల ఆర్డర్లు సువాసనగల బిర్యానీ రైస్‌కు రాగా, మినీ బిర్యానీ 5.2 లక్షల ఆర్డర్లను అందుకుంది. జనవరి 2023 నుంచి 15 జూన్ 2023 వరకు స్విగ్గీ లో చేసిన ఆర్డర్ల విశ్లేషణ ఆధారంగా ఈ ఫలితాలు వచ్చినట్లు కంపెనీ ఓ ప్రెస్ నోట్లో తెలిపింది.
హైదరాబాద్ లో నగరంలో దాదాపు 15 వేల కంటే ఎక్కువ ఉన్న రెస్టారెంట్లు తమ మెనూలలో బిర్యానీని అందిస్తున్నాయి. కూకట్పల్లి, మాదాపూర్, అమీర్‌పేట్, బంజారాహిల్స్, కొత్తపేట్, దిల్సుఖ్నగర్లలో అత్యధికంగా బిర్యానీ అందించే రెస్టారెంట్లు ఉన్నాయి. ఇవి నగరంలోని బిర్యానీ ఔత్సాహికులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఆ తర్వాతి స్థానాల్లో మాదాపూర్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్ నిలిచాయని స్విగ్గీ పేర్కొంది. హైదరాబాద్ అంటే బిరియానీ.. బిరియానీ అంటే హైదరాబాద్ అనే పేరు వచ్చింది. ఇక అందుకు తగ్గట్టే హైదరాబాద్ కు వచ్చిన ఎవరైనా నాన్ వెజ్ ప్రియులు బిరియానీ రుచి చూసే వెళతారు. ఇక వీకెండ్ సమయాల్లో బిరియానీల పని పట్టడానికి రెస్టారెంట్ల తలుపు తడుతూ ఉన్నారు.
Next Story