Mon Dec 23 2024 08:29:50 GMT+0000 (Coordinated Universal Time)
ఇక ఔటర్ రింగ్ రోడ్డుపై స్పీడ్ లిమిట్ పెరిగినట్లే..!
ఔటర్ రింగ్ రోడ్డుపై తెంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు మీద స్పీడ్
ఔటర్ రింగ్ రోడ్డుపై తెంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు మీద స్పీడ్ లిమిట్ 100 కిలోమీటర్లు ఉండగా.. ఈ స్పీడ్‌ను ఇప్పుడు ప్రభుత్వం పెంచింది. గంటకు 100 కిలోమీటర్ల వేగం నుంచి 120 కిలోమీటర్ల వేగానికి పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్‌కు అధికారులు జారీ చేశారు. ఇటీవల ఓఆర్ఆర్ అధికారులు, పోలీసులతో మంత్రి కేటీఆర్ ఓ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలోనే స్పీడ్ లిమిట్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఇందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు పోలీసులు.
ఇంతకు ముందు కూడా స్పీడ్ లిమిట్ 120 ఉండేది.. అయితే ప్రమాదాలు పెరుగుతున్న దృష్ట్యా సైబరాబాద్ పోలీసులు గతంలో వేగ పరిమితిని 120 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లకు తగ్గించారు. ఆ తర్వాత ఓఆర్ఆర్ఆర్ ప్రయాణికుల భద్రతపై చర్యలు తీసుకున్నారు. మళ్లీ ఇప్పుడు స్పీడ్ లిమిట్‌ను పెంచాలని నిర్ణయించుకున్నారు. తాజాగా ఓఆర్ఆర్ పై చాలా మార్పులు చేసి.. కొత్తగా నిబంధనలను మార్చారు. ప్రస్తుతం దాదాపు 154 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఓఆర్ఆర్ఆర్పై లైటింగ్ సిస్టంతో పాటు రోడ్ సేఫ్టీ మేజర్స్ పాటిస్తూ అన్ని చర్యలు తీసుకున్నారు.
Next Story