Mon Dec 23 2024 11:44:00 GMT+0000 (Coordinated Universal Time)
అంతమందికి ఇచ్చారా.. హైదరాబాద్ లో నకిలీ ఆధార్, పాక్ పోర్ట్ ముఠా
హైదరాబాద్ లో నకిలీ ఆధార్, పాక్ పోర్ట్ ముఠా
హైదరాబాద్ పోలీసులు భారీగా ఫేక్ ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులు, పాస్ పోర్టులు తయారు చేసి ఇచ్చిన గ్యాంగ్ ను పట్టుకున్నారు. నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్, మహంకాళి పోలీసులు కలిసి నిర్వహించిన ఆపరేషన్ లో 2015 నుండి 50,000 నకిలీ ఓటర్ ఐడి కార్డులు, 30,000 ఆధార్ కార్డులు, 1,250 నకిలీ పాస్‌పోర్ట్‌లు, 2,000 జనన ధృవీకరణ పత్రాలు, ఇతర బోగస్ డాక్యుమెంట్లను తయారు చేసి విక్రయించిన ఆరుగురు సభ్యుల ముఠాను ఛేదించారు. ముఠా నుంచి రూ.1.5 లక్షల నగదు, 557 నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు, 300 నకిలీ ధృవీకరణ పత్రాలు, 40 నకిలీ ఆధార్ కార్డులు, 50 నకిలీ జనన ధృవీకరణ పత్రాలు, పలు నకిలీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. పాస్‌పోర్ట్‌లు పొందేందుకు పత్రాలు, ఆధార్ దిద్దుబాట్ల కోసం బయోమెట్రిక్ డివైజ్ లు, ఇతర మెటీరియల్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను యెల్గం రాజ్ కుమార్, ఎండీ మహబూబ్, రాచమల్ల విజయలక్ష్మి, కూరపాటి పల్లవి, బండి శంకర్, గిరిరాజ్ అనిల్ కుమార్‌లుగా పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ ఆర్ఎస్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారని, నకిలీ పత్రాలు తయారు చేయడంలో ఇతర నిందితులు సహకరించారని పోలీసులు తెలిపారు. నిందితులను మహంకాళి పోలీసులకు అప్పగించగా.. రిమాండ్‌కు చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు.
Next Story