నకిలీ ఐపీఎస్ గుట్టురట్టు.. దొరికిన వాళ్లందరినీ దోచేశాడు
ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా నగరానికి వచ్చిన కార్తీక్ ముందుగా ఓ ట్రావెల్ ఏజెన్సీలో పనిచేశాడు. అక్కడ నాలుగు వాహనాలను
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ IPS/కల్నల్ ను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. మాదాపూర్ పోలీసు బృందాలు నిందితుడి వద్ద రూ. 2,00,000 విలువైన 7.65 కంట్రీ మేడ్ పిస్టల్, 9 లైవ్ రౌండ్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎస్ చిహ్నం, పోలీసు యూనిఫారాలు, ఢిల్లీ, తెలంగాణ పోలీసుల ఐడీ కార్డులు, ఆర్మీ బ్యాడ్జీలు, హ్యాండ్‌కఫ్‌లు, మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా చిక్కాల గ్రామానికి చెందిన 25 ఏళ్ల నాగరాజు కార్తీక్ రఘువర్మ అలియాస్ కార్తీక్‌గా గుర్తించారు. అతను తన స్వగ్రామంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, 2016 సంవత్సరంలో భీమవరంలోని SRK డిగ్రీ కళాశాలలో BA డిగ్రీ పూర్తి చేసి ఆపై హైదరాబాద్‌కు వచ్చాడు. ఐపీఎస్ ఆఫీసర్‌ను, ఆర్మీ మేజర్‌ను అంటూ ప్రజలను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. విశ్వసనీయ సమాచారంతో మాదాపూర్ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ టీమ్ ఆధ్వర్యంలో రామ్ ఐపీఎస్ పేరుతో చలామణి అవుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీసీపీ శ్రీనివాస్ వివరించారు.