Thu Nov 14 2024 03:38:38 GMT+0000 (Coordinated Universal Time)
సినిమా స్టైల్ లో అమ్మాయి ప్రాణాలు కాపాడిన హైదరాబాద్ పోలీసులు
పోలీసులు వేగంగా స్పందించడంతో ఓ అమ్మాయి ప్రాణాలు నిలబడ్డాయి. దుర్గం చెరువు వద్ద
పోలీసులు వేగంగా స్పందించడంతో ఓ అమ్మాయి ప్రాణాలు నిలబడ్డాయి. దుర్గం చెరువు వద్ద ఆత్మహత్యకు యత్నించిన అమ్మాయిని పోలీసులు కాపాడారు. 16 ఏళ్ల టీనేజర్ ను.. ఎక్కువగా ఫోన్ వాడుతూ ఉండడంతో.. ఆమె తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఆమె ఎంతగానో బాధపడింది. కాలేజీకి వెళుతున్నట్లు చెప్పి తన ఇంటిని విడిచిపెట్టింది. దుర్గం చెరువు వద్దకు చేరుకుని.. ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే పోలీసులు వేగంగా స్పందించడంతో ఆమె ప్రాణాలు నిలబడగలిగాయి. KPHB పోలీసులు అప్రమత్తమవ్వడం వలన ఆమె ప్రాణాలు కాపాడారు. మాదాపూర్ పోలీసులతో కలసి పోలీసులు రంగంలోకి దిగి అమ్మాయి లొకేషన్‌ను ట్రాక్ చేశారు. వారు వచ్చే సమయానికి ఆమె అప్పటికే దుర్గం చెరువు లోకి దూకినప్పటికీ.. వెంటనే ఈతగాళ్లు నీటిలోకి దూకి ఆమెను రక్షించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటూ ఉంది అమ్మాయి.
మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్బీలో ఉంటున్న ఓ బాలిక ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఈ మధ్య ఫోన్ ఎక్కవగా వాడుతున్నట్లు తల్లి గమనించింది. తల్లి బాలికను మందలించింది. మంగళవారం ఉదయం కాలేజీకి వెళ్తున్నానని చెప్పి.. ఆమె ఇంటి నుంచి బయల్దేరింది. ఆ తర్వాత కాసేపటికే ఆమె కాలేజీకి రాలేదని యాజమాన్యం తల్లి ఫోన్ చేసి చెప్పింది. కంగారు పడిన తల్లి తెలిసిన వారి ఇళ్లకు ఫోన్ చేసి అడిగింది. వారు తమ వద్దకు రాలేదని చెప్పటంతో ఆందోళనకు గురై, కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సకాలంలో స్పందించిన పోలీసులు బాలిక సెల్‌ఫోన్‌ను ట్రాక్ చేశారు. ఆమె మధ్యాహ్నం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద ఉందని సిగ్నళ్ల ద్వారా గుర్తించారు. వెంటనే మాదాపూర్ పోలీసులను అప్రమత్తం చేశారు. వారు లేక్ పోలీసులు, ఐటీ మొబైల్ సిబ్బందిని అలెర్ట్ చేసి చెరువు వద్దకు పంపించారు. ఆ సమయంలో బాలిక కేబుల్ బ్రిడ్జి నుంచి చెరువులోకి దూకింది. పోలీసులు, బోటింగ్ సిబ్బంది సహాయంతో బాలికను సురక్షితంగా రక్షించి ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని కాపాడిన లేక్ పోలీసులను సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అభినందించారు.
Next Story