హైదరాబాద్ లో రిస్క్ చేసి ప్రజల ప్రాణాలను కాపాడిన ట్రాఫిక్ పోలీసులు
హైదరాబాద్ ఎర్రమంజిల్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పంజాగుట్ట
హైదరాబాద్ ఎర్రమంజిల్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పంజాగుట్ట సమీపంలో ఎర్రమంజిల్ కాలనీలో ఉన్న భవనం ఆరో అంతస్తులోని పెంట్‌హౌస్‌లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్‌తో దట్టమైన పొగలు వ్యాపించడంతో అందులో ఉంటున్న కుటుంబం బయటకు రాలేకపోయింది. చుట్టు పక్కల వారు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. తలుపులు తెరవలేక ఇంట్లోని వారు ఇబ్బందులు పడుతూ ఉండగా.. ఫైర్ సిబ్బంది వచ్చే లోపు సమీపంలో ఉన్న ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు వేగంగా స్పందించడంతో ముప్పు తప్పింది. ఇంట్లో ఉంటున్న ఆరుగురు కుటుంబ సభ్యులు నిద్రలో ఉండటంతో పొగలో చిక్కుకుపోయారు. ఆరో అంతస్తులోని పెంట్ హౌస్‌లో మంటలు చెలరేగిన ఫ్లాట్ తలుపుల్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ పగులగొట్టారు. భవనం పైభాగంలో అందుబాటులో ఉన్న డంబెల్ సాయంతో తలుపుల్ని విరగ్గొట్టి తలుపులు తెరవడంతో ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న లా అండ్ ఆర్డర్ పోలీసులు భవనం పై భాగానికి చేరుకుని మంటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చారు. ఆ తర్వాత అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు.