Mon Dec 23 2024 11:14:34 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ వాసుల్లారా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయమిది
భారీ వర్షం నేపథ్యంలో GHMC అధికారులు కీలక సూచనలు చేశారు. నగరవాసులు అవసరం అయితేనే
హైదరాబాద్ను భారీ వర్షం ముంచెత్తుతోంది. సోమవారం నాడు రెండు గంటలపాటు ఏకధాటిగా వర్షం కురిసింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ నీరు చేరిపోయింది. భారీ వర్షం కారణంగా సాయంత్రం సమయంలో వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎల్లో అలర్ట్ అధికారులు ప్రకటించగా.. నగరం నలుమూలలా రెండు గంటలపాటు కుంభవృష్టి కురిసింది. ఉరుములు మెరుపులతో కురిసిన వర్షంతో హైదరాబాద్ అతలాకుతలం అయింది. రోడ్లు జలాశయాల్లా మారాయి. రాబోయే రోజుల్లో కూడా హైదరాబాద్ కు వర్షం ముప్పు పొంచి ఉంది.
భారీ వర్షం నేపథ్యంలో GHMC అధికారులు కీలక సూచనలు చేశారు. నగరవాసులు అవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు. సాధ్యమైనంత వరకు లోపలే ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎమర్జెన్సీ అయితే 040 21111111 లేదా 9000113667 లకు ఫోన్ చేయాలని సూచనలు చేస్తున్నారు...
రానున్న ఐదు రోజుల పాటు కూడా రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నేడు ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అంచనా వేయగా.. మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది.
Next Story