Thu Apr 03 2025 03:57:32 GMT+0000 (Coordinated Universal Time)
Hussain Sagar: టెన్షన్ పెడుతున్న హుస్సేన్ సాగర్
ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ నీటి మట్టాలు దాదాపు పూర్తి స్థాయికి చేరుకున్నాయి.

ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ నీటి మట్టాలు దాదాపు పూర్తి స్థాయికి చేరుకున్నాయి. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, శానిటేషన్ డిపార్ట్మెంట్ సిబ్బంది నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి నిల్వలను తొలగించేందుకు కృషి చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ ఎఫ్టిఎల్ 513.41 మీటర్లు కాగా, గరిష్ట నీటిమట్టం ఎండబ్ల్యుఎల్ 514.75 మీటర్లు. ఆదివారం రాత్రి 7:45 గంటల సమయానికి నీటి మట్టాలు 513.210 మీటర్లకు చేరాయి. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పరిస్థితిని పరిశీలించి.. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ నగరంలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకు సగటున 8.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రహదారులపై భారీగా వరద నీరు చేరింది. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. కొన్ని చోట్ల కార్లు, ఆటోలతో పాటు ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి.
Next Story