భారీగా టెన్షన్ పెడుతున్న మూసీ నది
భారీగా టెన్షన్ పెడుతున్న మూసీ నది.. మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతూ ఉండడంతో ముందస్తుగా ఎనిమిది గేట్లు నాలుగు అడుగుల
మూసీ నది హైదరాబాద్ ప్రజలను టెన్షన్ పెడుతూ ఉంది. భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతూ ఉండడంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. జంటజలాశయాలతోపాటు గండిపేట చెరువు గేట్లు ఎత్తివేయడంతో నదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. దీంతో మూసారాంబాగ్ వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వంతెనకు రెండు వైపుల బారికేడ్లు ఏర్పాటు చేశారు. అంబర్‌పేట-మలక్‌పేట మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ ఉగ్రరూపం దాల్చడంతో మూసానగర్, కమలానగర్‌ను వరద చుట్టిముట్టింది. మూసారాంబాగ్ లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీచేయించారు. రత్నానగర్, పటేల్‌నగర్ గోల్నాకలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు బాధితులను తరలించారు. వరదల కారణంగా చాదర్‌ఘాట్ బ్రిడ్జిని అధికారులు మూసివేశారు. ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.