Mon Dec 23 2024 08:32:47 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు
హైదరాబాద్ శివార్లలో బస్సులో మంటలు చెలరేగడంతో కలకలం పెద్ద అంబర్ పేట వద్ద హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న బీహెచ్ఈఎల్
బస్సుల్లో సాఫీగా ప్రయాణం సాగుతుంది.. గమ్యస్థానాలకు చేరిపోతాం అనుకుంటూ ఉండే సందర్భాల్లో మంటలు చెరిగిన ఘటనల గురించి మనం చాలా చూశాం. కొన్ని కొన్ని సార్లు అలా చెలరేగిన మంటలు బస్సులను బూడిద చేస్తుంటాయి. ప్రయాణీకుల ప్రాణాలను తీస్తూ ఉంటాయి. ఇలాంటి దారుణాలను మనం వింటూనే ఉంటాం. అలాంటి ఘటన హైదరాబాద్ నగర శివార్లలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పింది.
హైదరాబాద్ శివార్లలో బస్సులో మంటలు చెలరేగడంతో కలకలం రేగింది. పెద్ద అంబర్ పేట వద్ద పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న బీహెచ్ఈఎల్ (BHEL) డిపోకు చెందిన రాజధాని బస్సులో మంటలు చెలరేగాయి. పెద్దంబర్పేట ఓఆర్ఆర్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును ఆపి, అందులోనుంచి ప్రయాణికులను దించివేశాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ఏసీలో మంటలు చెలరేగడంతోనే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story