హైదరాబాద్ కు త్వరలోనే ఫ్రెంచ్ కాన్సులేట్
ఈ ఉదయం నేను ఈ విషయంలో భారతీయ విద్యార్థులకు ఒక సందేశాన్ని ఇస్తున్నాను
హైదరాబాద్ నగరంలో ఫ్రెంచ్ కాన్సులేట్ ను అతి త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ఫ్రెంచ్ ఫారెన్ మినిస్టర్ కేథరీన్ కొలోనా తెలిపారు. ఫ్రాన్స్ కు ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా నాలుగు కాన్సులేట్స్ ఉన్నాయి.. త్వరలోనే హైదరాబాద్ లో ప్రారంభించనున్నారు. ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి కేథరీన్ కొలోనా మాట్లాడుతూ "ఫ్రాన్స్ బ్యూరోను త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్నాము. ఇది చెన్నైలోని మా 4 కాన్సులేట్ జనరల్‌లకు, మా 15 అలయన్స్ లతో ముడిపడి ఉంటుంది. ఇకపై మీరు భారతదేశంలో ఎక్కడ నివసిస్తున్నా ఫ్రాన్స్ దూరంగా ఉండదు, " అని అన్నారు. బుధవారం న్యూ ఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో కొలోనా ఈ విషయాన్ని తెలిపారు. ఫ్రాన్స్ భారతీయ విద్యార్థుల కోసం స్వాగతం పలుకుతూ ఉందని.. 2025 నాటికి 20,000 మంది విద్యార్థులను ఆహ్వానించబోతున్నామని మా దేశం ప్రతిష్టాత్మకంగా లక్ష్యంగా పెట్టుకుందని ఆమె అన్నారు.