నేడు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
జులై 4 న హైదరాబాద్ నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లోని
జులై 4 న హైదరాబాద్ నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 10.30 గంటల వరకు హకీంపేట్ వై జంక్షన్, బొల్లారం చెక్ పోస్ట్, నేవీ జంక్షన్, యాప్రాల్ రోడ్, హెలిప్యాడ్ వై జంక్షన్, బైసన్ గేట్, లోత్కుంట ప్రాంతాల్లో వెహికల్స్‌కు అనుమతి ఉండదన్నారు. అటువైపుగా వెళ్లే వాహనదారులను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు. బొల్లారం, అల్వాల్, లోత్కుంట, త్రిముల్ఘేరి, కార్ఖానా, JBS, ప్లాజా జంక్షన్, PNT ఫ్లైఓవర్ రూట్లలో వచ్చే వాహనాలను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యామ్నాయ రూట్లలో మళ్లించనున్నారు. అటువైపు నుంచి వచ్చే వాహనాలను HPS అవుట్ గేట్, బేగంపేట్ ఫ్లైఓవర్, గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్ మోనప్ప జంక్షన్, ఎన్ఎఫ్సీఎల్, ఎన్టీఆర్ భవన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నంబర్ 45 జంక్షన్ వైపు మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు.