Mon Dec 23 2024 09:05:35 GMT+0000 (Coordinated Universal Time)
నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ కు వస్తుండటంతో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు
భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ కు వస్తుండటంతో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సిక్రింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మాదిగల విశ్వరూప బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. సాయంత్రం 4.45 గంటలకు ప్రధాని మోదీ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. అనంతరం రోడ్ మార్గాన పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే సభలో పాల్గొననున్నారు. మోదీ ఈ సభలో దాదాపు 45 నిమిషాల పాటు సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 6గంటల ఆయన బేగంపేట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 8గంటల వరకు పలు ప్రాంతాల్లో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ప్రయాణికులు, వాహనదారులు తాము సూచించిన మార్గంలో వెళ్లాలని, హైదరాబాద్ పోలీసులకు సహకరించాలని కోరారు.
కార్ఖానా, జేబీఎస్ నుంచి ఎస్బీహెచ్-పాట్నీ వైపు వచ్చే ట్రాఫిక్ స్వీకర్ ఉపకార్ దగ్గర YMCA – క్లాక్ టవర్ – ప్యాట్నీ లేదా టివోలి-బ్రూక్ బాండ్ – బాలమ్రాయ్-సీటీవో వైపు మళ్లిస్తారు. ప్యాట్నీ నుంచి వచ్చే ట్రాఫిక్, వాహనాలు ఎస్బీహెచ్-స్వీకర్ ఉపాకర్ వైపు నో ఎంట్రీ.. క్లాక్ టవర్-YMCA లేదా ప్యారడైజ్- సీటీవో వైపు మళ్లింపు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆర్టీఏ త్రిముల్‌గేరీ, కార్ఖానా, మల్కాజ్గిరి, సఫిల్‌గూడ నుంచి ప్లాజా వైపు వచ్చే ట్రాఫిక్‌ను తివోలి దగ్గర స్వీకర్-ఉపాకార్, YMCA లేదా బ్రూక్ బాండ్, బాలమ్రాయ్, CTO వైపు మళ్లింపు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి బేగంపేట వైపు వచ్చే ట్రాఫిక్‌ను పంజాగుట్ట దగ్గర ఖైరతాబాద్ వైపు, గ్రీన్ ల్యాండ్ దగ్గర రాజ్‌భవన్ వైపు మళ్లిస్తారు. గ్రీన్ లాండ్స్ – పంజాగుట్ట – బేగంపేట్ నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వైపు వెళ్లే వారు ఆ రూట్ లో వెళ్ళొద్దని పోలీసులు సూచించారు. సంగీత్ ఎక్స్ రోడ్ నుంచి బేగంపేట వైపు వచ్చే ట్రాఫిక్ YMCA దగ్గర క్లాక్ టవర్ – ప్యాట్నీ – ప్యారడైజ్ – సీటీఓ – రసూల్‌పురా – బేగంపేట వైపు మల్లింపు ఉంటుంది. బేగంపేట నుంచి సంగీత్ X రోడ్ల వైపు వచ్చే ట్రాఫిక్ సీటీఓ X రోడ్ల దగ్గర బాలమ్రాయ్ – బ్రూక్ బాండ్ – టివోలి – స్వీకర్ ఉప్కార్ – YMCA – సెయింట్ జాన్స్ రోటరీ – సంగీత x రోడ్ల వైపు డైవర్ట్ చేస్తారు. బోవెన్‌పల్లి, తాడ్‌బండ్ నుంచి టీవోలి వైపు వచ్చే ట్రాఫిక్ బ్రూక్ బాండ్ దగ్గర సీటీవో – రాణిగంజ్ – ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తారు.
Next Story