Sun Nov 17 2024 02:49:34 GMT+0000 (Coordinated Universal Time)
ఈరోజు తాగి నడిపితే ఇక అంతే
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మందుబాబులు ఈరోజు రాత్రి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు
ట్రాఫిక్ పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మందుబాబులు ఈరోజు రాత్రి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కొత్త సంవత్సర వేడుకలను జరుపుకునే వారు మద్యం సేవించి రోడ్డుపైకి వాహనంతో వస్తే పది వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఆరు నెలల జైలు శిక్ష పడనుంది. ఇది తొలిసారి మాత్రమే. రెండోసారి రిపీట్ చేస్తే పదిహేను వేల జరిమానాతో పాటు రెండు సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
రేపు ఉదయం వరకూ...
ఈరోజు రాత్రి నుంచి రేపటి ఉదయం వరకూ అన్ని ప్రాంతాల్లో చెకింగ్ లను నిర్వహిస్తామని పోలీసులు చెబుతున్నారు. తాగి వాహనం నడిపితే ఊరుకోబోమని తెలిపారు. డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ లో దొరికితే కొత్త ఏడాది జైలులో ఉండాల్సి వస్తుందని హెచ్చరించారు. ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేసినా చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్ లోని బేగంపేట్, లంగర్హౌస్ తప్పించి అన్ని ఫ్లైఓవర్లను మూసివేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని, నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా, సంతోషంగా జరుపుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
Next Story