Mon Nov 18 2024 02:57:13 GMT+0000 (Coordinated Universal Time)
ఉప్పల్ లో అగ్నిప్రమాదం జరిగితే..?
ఆదివారం భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనున్న ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో
ఆదివారం భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనున్న ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఫైర్ నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్ఓసి) లేదని తెలుస్తోంది. కొన్నేళ్లుగా కూడా స్టేడియం నిర్వాహకులు అలాగే ఉండిపోయారు తప్పితే నిబంధనలను పాటించాలని ఏ మాత్రం అనుకోలేదు. నిబంధనలను పాటించనందుకు 2019లో తిరస్కరించబడింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) స్టాప్-గ్యాప్ అగ్నిమాపక పరికరాలను స్టేడియంలో తిరిగి తీసుకుని రావడానికి ప్రయత్నించి మ్యాచ్‌లను నిర్వహించడానికి అనుమతిని పొందుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
హెచ్‌సిఎ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ మాట్లాడుతూ, "అగ్నిమాపక శాఖ అనుమతి మాకు అవసరం. మేము ప్రతి నిబంధనను అనుసరిస్తున్నందున ఆందోళన చెందాల్సిన పని లేదు." ఇక స్టేడియంకు వెళ్లే రహదారి 40-60 అడుగుల వెడల్పుతో ఉండడం కూడా విమర్శలకు తావిస్తోంది. "జింఖానాలో మాదిరిగా తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడితే ఎంతో మంది ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది" అని అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు తెలిపారు. పెద్ద ఇన్ఫ్రా ప్రాజెక్టుల కోసం, అప్రోచ్ రోడ్డు కనీసం 100 అడుగుల వెడల్పు ఉండాలి.. కానీ ఉప్పల్ స్టేడియం ముందు అలాంటి రోడ్డు లేదని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ ప్రాంతీయ అగ్నిమాపక అధికారి వి పాపయ్య మాట్లాడుతూ, "స్టేడియంలో అత్యవసర పరిస్థితిని ఎదుర్కోడానికి స్మోక్ డిటెక్టర్లు, ఆటోమేటిక్ స్ప్రింక్లర్లు లేవని.. అందుకు కావాల్సిన 20,000-లీటర్ల వాటర్ ట్యాంక్‌లు లేవు" అని చెప్పుకొచ్చారు. ఫైర్ రిటార్డింగ్ సొల్యూషన్‌ను కలిగి ఉండాలని.. ఫైర్ హైడ్రెంట్ల వద్ద సిబ్బందిని నియమించాలని మేము హెచ్సిఎని ఆదేశించారు. ఎటువంటి అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికైనా.. 2 లక్షల లీటర్ల గ్రౌండ్ వాటర్ పంపును కూడా సిద్ధం చేశామని పాపయ్య చెప్పారు.
సాంకేతిక కారణాల వల్ల ఎన్ఓసీని తిరస్కరించినట్లు ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ జైన్ తెలిపారు. అయితే, T20 మ్యాచ్ కోసం HCA భద్రతా చర్యలను ఏర్పాటు చేసిందని చెప్పుకొచ్చారు. సెప్టెంబరు 3న స్టేడియంను పరిశీలించిన తర్వాత హెచ్‌సిఎ, ఫైర్ సర్వీసెస్ వింగ్ కలిసి స్టేడియంలో ఫైర్-సేఫ్టీ పరికరాలను ఏర్పాటు చేశాయని ఆయన చెప్పారు. అగ్నిమాపక అధికారులు స్టేడియంలోని ఎగ్జిట్ పాయింట్ల వద్ద ఉంటారు. 60 మంది అగ్నిమాపక సిబ్బందితో పాటూ.. మరో 40 మంది వాలంటీర్లు అక్కడే ఉంటారు.
Next Story