Sat Nov 23 2024 04:28:45 GMT+0000 (Coordinated Universal Time)
ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లిన మహిళ.. ఎలాంటి స్థితిలో కనిపించిందంటే?
మనం ఊహించినట్లుగా అక్కడి పరిస్థితులు ఉండవు. ఊహించని విధంగా జీవితాలు తారుమారు అవుతూ ఉంటాయి.
గొప్ప గొప్ప చదువులు చదవాలని.. భవిష్యత్తుగా గొప్పగా ఉండాలని ఎంతో మంది విదేశాలకు వెళుతూ ఉంటారు. మనం ఊహించినట్లుగా అక్కడి పరిస్థితులు ఉండవు. ఊహించని విధంగా జీవితాలు తారుమారు అవుతూ ఉంటాయి. అమెరికాలో ఎంఎస్ చేయాలని వెళ్లిన ఓ మహిళ దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంది. డెట్రాయిట్లోని TRINE విశ్వవిద్యాలయంలో MS చదివేందుకు వెళ్లిన హైదరాబాద్కు చెందిన ఒక మహిళ చికాగోలో ఆకలితో అలమటిస్తూ ఉంది. మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబిటి) ప్రతినిధి అమ్జదుల్లా ఖాన్ ట్విట్టర్లో ఆమెకు సంబంధించిన వీడియో షేర్ చేశారు. ఒక వీధిలో ఒక మూలన మహిళ కూర్చుంది.. బక్కచిక్కిపోయి తినడానికి ఏమీ లేని పరిస్థితుల్లో ఆమె కనిపించింది.
ఆ వీడియోలో ఆ మహిళ తన పేరు సయ్యదా లులు మిన్హాజ్ జైదీ అని, తన సొంత ఊరు హైదరాబాద్ అని తెలిపింది. ఆమె పరిస్థితి గురించి అడగ్గా.. తనను చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారని, పరీక్షల కోసం ఆమె శరీరం నుండి రక్త నమూనాలను సేకరించిన తర్వాత ఆమె మరింత బలహీనపడ్డానని చెప్పింది. వీడియోలో ఉన్న ఒక వ్యక్తి ఆమెకు తినడానికి సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు. అతను ఆమెను భారతదేశానికి తిరిగి రావాలని కోరారు. ఆమెను భారత్ కు తీసుకుని వచ్చేలా చర్యలు తీసుకోవాలని మిన్హాజ్ జైదీ కుటుంబం కోరుతోంది.
Next Story