Tue Nov 05 2024 16:36:16 GMT+0000 (Coordinated Universal Time)
సార్ కు క్షమాపణలు చెప్పిన పోలీసు జంట
హైదరాబాద్‌కు చెందిన పోలీస్ దంపతుల ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో
హైదరాబాద్‌కు చెందిన పోలీస్ దంపతుల ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే. వధూ వరులు ఇద్దరూ పోలీసులు అవ్వడం.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోనే ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడం, పోలీస్ డ్రెస్‌లో ఫొటోలకు ఫోజులు ఇవ్వడం వివాదాస్పదం అయింది. పోలీస్ వెహికల్, డ్రెస్, పోలీస్ స్టేషన్‌ను ప్రీ వెడ్డింగ్ షూట్‌కు ఉపయోగించుకోవడంపై కొందరు విమర్శలు గుప్పించారు. ఎస్సై భావనతో ఏఆర్ ఎస్సై రావూరి కిషోర్ వివాహం ఆగష్టు 26వ తేదీన జరిగింది.
ప్రీ వెడ్డింగ్ షూట్‌పై హైదరాబాద్ సీపీ సీ.వీ.ఆనంద్ స్పందిస్తూ.. పోలీసుశాఖకు చెందిన వాహనాలు, సింబళ్లను ప్రీ వెడ్డింగ్షూట్లో భాగంగా చిత్రీకరించటంలో తనకు పెద్దగా అభ్యంతరకర విషయం ఉన్నట్టుగా అనిపించలేదని అన్నారు. ఆహ్వానించి ఉంటే పెళ్లికి వెళ్లి ఆశీస్సులు అందజేసేవాన్ని అని చెప్పారు. ముందుగా చెప్పి ఉంటే మేమే అనుమతి ఇచ్చేవారమన్నారు. పోలీసు శాఖలో పని చేయటం.. అందులోనూ మహిళలు విధులు నిర్వహించటం సవాల్‌తో కూడుకుని ఉంటుదన్నారు. పోలీసుశాఖలోనే ఎస్ఐగా డ్యూటీ చేస్తున్న భాస్కర్‌ను పంజాగుట్ట ఎస్ఐ భావన భర్తగా ఎంపిక చేసుకుని పెళ్లి చేసుకోవటం పోలీసులందరూ ఆనందించాల్సిన విషయమన్నారు. ముందుగా అనుమతి తీసుకోకుండా ఇలా ప్రీ వెడ్డింగ్షూట్లు జరపొద్దని అన్నారు.
తాజాగా పోలీస్ జంట హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ను కలిశారు. దంపతులు ఎస్ఐ భావన, రావు కిషోర్ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ను శనివారం నాడు కలిశారు. ప్రీ వెడ్డింగ్ షూట్‌కు పోలీస్ డ్రెస్, వెహికల్, పోలీసుల ప్రాపర్టీ ఉపయోగించుకోవడంపై ఆయనకు క్షమాపణలు చెప్పారు. సీవీ ఆనంద్ సంతోషంగా ఉండాలని కొత్త జంటను ఆశీర్వదించారు.
Next Story