Wed Mar 26 2025 07:18:36 GMT+0000 (Coordinated Universal Time)
Hydra : వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై హైడ్రాకు ఫిర్యాదు
వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డిపై హైడ్రా లో ఫిర్యాదు చేశారు. ఒకమహిళ హైడ్రా కమిషనర్ రంగనాధ్ కు ఈ ఫిర్యాదు చేశారు.

వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డిపై హైడ్రా లో ఫిర్యాదు చేశారు. ఒకమహిళ హైడ్రా కమిషనర్ రంగనాధ్ కు ఈ ఫిర్యాదు చేశారు. అమీన్ పూర్ లోని 193 సర్వే నెంబరులోని తమ ల్యాండ్ ను కబ్జా చేశారని మహిళ ఫిర్యాదు చేశారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యేరాం భూపాలరెడ్డితో పాటు శిష్ట్లా రమేష్ లు కలసి తమ ల్యాండ్ ను కబ్జా చేశారని ఆమె ఆరోపించారు. తమపై దౌర్జన్యాలకు దిగారన్న ఆమె అందుకు సంబంధించిన ఆధారాలను కూడా కమిషనర్ కు సమర్పించారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని...
అయితే ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ సానుకూలంగా స్పందంచారని మహిళ తర్వాత మీడియాకు తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులను సోమవారం తీసుకోవడంతో ఈ విషయం వెలుగు చూసింది. అప్పట్లో తమకున్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని ల్యాండ్ ను కబ్జా చేశారని, ఇప్పుడు తమ భూమిని తమకు ఇప్పించాలని ఆమె కమిషనర్ ను కోరగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపింది.
Next Story