Mon Dec 23 2024 01:47:20 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : కింగ్ నాగార్జునకు షాక్ ఇచ్చిన హైడ్రా.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత
సినిమా నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా అధికారులు కూల్చివేతలను ప్రారంభించారు.
సినిమా నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా అధికారులు కూల్చివేతలను ప్రారంభించారు. ఈరోజు శని వారం కావడంతో ఉదయాన్నే కూల్చివేతలను ప్రారంభించారు. మాదాపూర్ లో ఉన్న ఎన్ కన్వెన్షన్ ను చెరువును ఆక్రమించి అక్రమంగా నిర్మించారని ఇటీవల హైడ్రా అధికారులకు ఫిర్యాదు అందింది. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించారని చెప్పారు.
చెరువును ఆక్రమించి...
తుమ్మిడి హట్టి చెరువును కబ్జా చేసి నాగార్జున దీనిని నిర్మించారని ఎప్పటి నుంచో ఫిర్యాదులున్నాయి. దాదాపు మూడు ఎకరాల స్థలాన్ని ఆక్రమించి ఈ ఎన్ కన్వెన్షన్ నిర్మించారని చెబుతున్నారు. అయితే హైడ్రా ఉన్నతాధికారులకు ఇటీవల ఫిర్యాదులు అందడంతో పాటు జనం కోసం సంస్థ తగిన ఆధారాలు ఇవ్వడంతో అధికారులు దీనిని కూల్చివేత పనులను ప్రారంభించారు.
Next Story