Fri Jan 10 2025 12:15:46 GMT+0000 (Coordinated Universal Time)
Hydra : హైడ్రా స్పీడ్ తగ్గినట్లేనా? ఒవైసీ, మల్లారెడ్డి నిర్మాణాల మాటేమిటి గురూ?
హైడ్రా అధికారులు తొలుత హడావిడి చేశారు. దానిని చూసి అందరూ నిజమేనని అనుకున్నారు
హైడ్రా అధికారులు తొలుత హడావిడి చేశారు. దానిని చూసి అందరూ నిజమేనని అనుకున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలన్నీ కూలిపోతాయని భావించారు. కానీ అది భ్రమేనని తేలింది. ఎందుకుంటే అనేకమంది రాజకీయ నాయకులు అక్రమ కట్టడాల జోలికి ఇక హైడ్రా వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. బిల్డర్లు, సాధారణ ప్రజలకు చెందిన ఆస్తులపై మాత్రమే హైడ్రా బుల్ డోజర్లు దూసుకెళుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే కొత్తలో హైడ్రా అధికారులు చూపిన ఉత్సాహం మాత్రం ఇప్పుడు కనిపించడం లేదు. పైగా రాజకీయ నేతల ఆక్రమణలను కూడా వదిలేది లేదని చెప్పిన అధికారుల కనీసం వాటికి నోటీసులు ఇచ్చే ప్రయత్నం కూడా చేయకపోవడంతో వాటి కూల్చివేతలు భ్రమేనని తేలింది.
అక్రమ నిర్మాణాలను...
ఒవైసీకి చెందిన కళాశాల అక్రమ నిర్మాణమని గతంలో హైడ్రా అధికారులు ప్రకటించారు. అలాగే బీఆర్ఎస్ నేత మల్లారెడ్డికి చెందిన కళశాల భవనాలు కూడా ఆక్రమణ చేసినవేనని నిర్ధారించినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. కానీ కళాశాలలకు సెలవుల సమయంలో వాటిని కూల్చివేస్తామని, విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం కూల్చివేయడం లేదని నాలుగైదు నెలల క్రితం ప్రకటించారు. జనం కూడా నిజమేనని అనుకున్నారు. ఇది రాజకీయంగా కూడా విమర్శలు పెద్దయెత్తున విమర్శించాయి. ఒవైసీ బ్రదర్స్ కూడా హైడ్రాపై నిప్పులు చెరిగారు. చెరువులను ఆక్రమించి నిర్మించారనుకుంటే ముందు సచివాలయాన్ని కూల్చివేయాలని కూడా వారు సవాల్ విసిరారు.
ఒవైసీ, మల్లారెడ్డి నిర్మాణాలను...
అయితే ఇటీవల కాలంలో ఒవైసీ సోదరులు అధికార కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. రేవంత్, ఒవైసీ సోదరులు కలసి ఈ మధ్య ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలోనే పాతబస్తీకి చెందిన ఎంఐఎం ఎమ్మెల్యేలతో తాను సచివాలయంలో సమావేశమై అక్కడి సమస్యలపై చర్చిస్తామని తెలిపారు. అంత వరకూ ఓకే కానీ, ఎన్నికల వరకే రాజకీయాలు అని, తర్వాత తామంతా భాయ్.. భాయ్ అని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఇక హైడ్రా బుల్ డోజర్ రాజకీయ నేతల అక్రమ నిర్మణాల వైపు వెళ్లదని చూచాయగా అర్థమయింది. దీంతో పాటు ప్రయివేటు సంస్థలకు చెందిన ఆస్తులపైనే ఎక్కువ దృష్టిపెడుతూ తామేంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు బిల్డప్ ఇస్తుందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. హైడ్రాకు కూడా రాజకీయ రంగు పులుముకుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అలాగే మల్లారెడ్డి కళాశాల విషయంలోనూ అదే జరగొచ్చు. అందుకే హడావిడిగా చేసే ఆర్భాటపు ప్రకటనలను నమ్మితే ఇలాగే ఉంటుందని సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి. ఎఫ్.టి.ఎల్. బఫర్ జోన్ పరిధిలో ఉన్నవాటిని కూల్చివేస్తామన్న హైడ్రా అధికారులు ఇప్పుడు పీచే ముఢ్ అన్నట్లుగానే కనపడుతుంది.
Next Story