Tue Apr 08 2025 12:35:24 GMT+0000 (Coordinated Universal Time)
Hydra : రేపటి నుంచి మళ్లీ ఆక్రమణలు తొలగింపు
హైడ్రా రేపటి నుంచి ఆక్రమణలను తొలగించే ప్రక్రియను ప్రారంభించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు

హైడ్రా రేపటి నుంచి ఆక్రమణలను తొలగించే ప్రక్రియను ప్రారంభించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఈ ఆక్రమణల తొలగింపు ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. మూసీ నదిని ప్రక్షాళన చేయడంతో పాటు నదీ పరివాహక ప్రాంతంలో ఆక్రమణలను తొలగించేందుకు హైడ్రాను ఆదేశించారు.
మూసీ నదీ పరివాహక ప్రాంతంలో...
మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లో మొత్తం పన్నెండు వేల ఆక్రమణలున్నాయి. వీరంతా పేద, సామాన్య ప్రజలేనని చెబుతున్నారు. అయితే మూసీ నది పరివాహక ప్రాంతంలో ఆక్రమణల తొలగింపుతో నిర్వాసితులయిన వారికి డబుల్ బెడ్ రూంలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రేపటి నుంచి మూసీ నది పరివాహక ప్రాంతంలో ఆక్రమణల తొలగింపునకు అధికారులు సిద్ధమవుతున్నారు.
Next Story