Sun Apr 13 2025 02:27:28 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదయిన కేసును కొట్టి వేయాలని ఆయన పిటీషన్ లో కోరారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదయిన కేసును కొట్టి వేయాలని ఆయన పిటీషన్ లో కోరారు. పుష్ప సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ కు ప్రీమియర్ షో చూసేందుకు వచ్చిన మహిళ తొక్కిసలాటలో మృతి చెందింది.

కేసు నమోదు చేయడంతో...
ఈ ఘటనలో సంధ్య థియేటర్ల యాజమాన్య వైఫల్యంపై కూడా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేశారు. అయితే అల్లు అర్జున్ థియేటర్ కు ముందస్తు సమాచారం లేకుండా రావడంతోనే తాము భద్రత కల్పించలేకపోయామని సంథ్య థియేటర్ యాజమాన్యం వివరణ ఇచ్చింది. అయితే ఈ విషయంలో అందరిపై కేసు నమోదు చేయడంతో తనపై నమోదయిన కేసును కొట్టి వేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
Next Story