Tue Apr 15 2025 09:44:59 GMT+0000 (Coordinated Universal Time)
గచ్చిబౌలి ఏడీఈ అక్రమాస్తులు వంద కోట్లట
గచ్చిబౌలిలో విద్యుత్ శాఖ ఏడీఈ సతీశ్‌రెడ్డి యాభే వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.

గచ్చిబౌలిలో విద్యుత్ శాఖ ఏడీఈ సతీశ్‌రెడ్డి యాభే వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. దీంతో నిన్నటి నుంచి ఆయన నివాసంతోపాటు వివిధ ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో 22 ఎకరాల వ్యవసాయ భూమి, ఓపెన్ ప్లాట్లు, విల్లా, భవనాలు ఉన్నట్టు గుర్తించారు.
ఏసీబీ అధికారుల దాడిలో...
ఈ స్థిరాస్తుల మార్కెట్ విలువ వంద కోట్ల రూపాయల విలువకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏడీఈ నివాసంలో స్థిరాస్తి పత్రాలు, బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం సతీశ్‌రెడ్డిని రిమాండ్‌కు తరలించారు. కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముందని భావిస్తున్నారు.
Next Story