Sun Dec 22 2024 22:33:37 GMT+0000 (Coordinated Universal Time)
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఇంట్లో ఐటీ శాఖ సోదాలు
హైదరాబాద్ లో ఆదాయపు పన్ను శాఖ సోదాలను ఉదయం నుంచి నిర్వహిస్తుంది.
హైదరాబాద్ లో ఆదాయపు పన్ను శాఖ సోదాలను ఉదయం నుంచి నిర్వహిస్తుంది. ముప్పా సంస్థలు, రాజ్పుష్ప లైఫ్ సిటీలోనూ తనిఖీలను నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ లో ఈ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఇంట్లో కూడా ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. వెంకట్రామిరెడ్డి గతంలో కలెక్టర్ గా పనిచేసి, రాజీనామా చేసిన అనంతరం ఆయన శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు.
ఐదు వాహనాల్లో వచ్చి...
ఐదు వాహనాల్లో వచ్చి ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిర్మాణరంగ సంస్థల లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. రేపు కూడా ఈ తనిఖీలు జరిపే అవకాశముంది. ఆదాయపు పన్నును ఎగవేశారన్న కారణంతో ఈ సోదాలను ఐటీ శాఖ ఉదయం నుంచి నిర్వహిస్తుంది. రికార్డులను పరిశీలిస్తుంది. కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
Next Story